News September 13, 2025

యాకుత్‌పురా ఘ‌ట‌న‌కు.. బాధ్యుల‌పై హైడ్రా చ‌ర్య‌లు

image

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి ప‌డిపోయిన ఘ‌ట‌న‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధ‌వారం సిల్ట్‌ను తొల‌గించ‌డానికి తెర‌చిన మ్యాన్ హోల్ మూయ‌క‌పోవ‌డంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో డీఆర్ఎఫ్ సూప‌ర్‌వైజర్లు ఇద్ద‌రికి డిమోషన్, ఇద్ద‌రిని తొల‌గించాలని ఆదేశించింది.

Similar News

News March 25, 2026

జీవీఎంసీలో పెరగనున్న కార్పొరేషన్ వార్డుల సంఖ్య

image

ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా వార్డుల సంఖ్య సవరణకు నిర్ణయం తీసుకుంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుతం జీవీఎంసీలో 98 వార్డులు ఉండగా, జనాభా దాదాపు 24 లక్షలకుపైగా చేరింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, జీవీఎంసీలో విలీనం చేయాల్సిన గ్రామాల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

News March 25, 2026

మచిలీపట్నం RTA ఆఫీస్‌పై ఏసీబీ దాడులు

image

మచిలీపట్నంలో రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లలో అక్రమాలపై అధికారులు రికార్డులు, కంప్యూటర్లు, పత్రాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

News March 25, 2026

అత్యంత కాలుష్య పట్టణం మన దేశంలోనే..

image

ప్రపంచంలో అత్యంత కాలుష్య పట్టణంగా లోనీ(UP) నిలిచింది. స్విస్ సంస్థ IQఎయిర్ విడుదల చేసిన గ్లోబల్ ర్యాంకింగ్స్-2025లో ఈ విషయం వెల్లడైంది. అత్యంత కలుషితమైన రాజధానుల జాబితాలో న్యూఢిల్లీ టాప్‌లో ఉంది. అదే సమయంలో వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా పాకిస్థాన్ నిలిచింది. ఈ లిస్టులో ఇండియా 6వ ప్లేస్‌లో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో కేవలం 14% నగరాలు మాత్రమే WHO ఎయిర్ క్వాలిటీ ప్రమాణాన్ని అందుకున్నాయి.