News September 13, 2025

నేటి సీఎం వరంగల్ పర్యటన వాయిదా..!

image

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు పర్యటనకు నేడు ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. మేడారం సమ్మక్క-సారలమ్మల అభివృద్ధి పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్న సీఎం శనివారం వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, వర్షభావ పరిస్థితులు, పోలీసులకు మావోయిస్టులకు ఛత్తీస్గఢ్‌లో జరుగుతున్న ఎదురు కాల్పుల నేపథ్యంలో వాయిదా వేసినట్లు సమాచారం. తిరిగి మరో తేదీని ప్రకటించనున్నారు.

Similar News

News March 18, 2026

NLG: రైతు భరోసాకు దరఖాస్తుల ఆహ్వానం

image

యాసంగి సీజన్ రైతు భరోసా కోసం కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులంతా ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ కుమార్ తెలిపారు. 5,21,577 మంది రైతులకు రైతు భరోసా అందుతోందని, జిల్లాలో 20,568 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయని.. వారంతా ఈ నెల 25లోగా తమ వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తులు అందజేయాలని కోరారు.

News March 18, 2026

దివ్యాంగులకు ఉచిత బస్సు: మంత్రి మండిపల్లి

image

దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. మార్చి 18న ఉదయం 11:30 గంటలకు రాయచోటి RTC బస్ స్టాండ్‌లో కార్యక్రమం జరగనుంది. ఈ పథకం ద్వారా దివ్యాంగుల ఆత్మగౌరవం, స్వావలంబనకు బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమానికి దివ్యాంగులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

News March 18, 2026

ఊర్కొండపేట: ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రీడలకు శివకుమార్ ఎంపిక

image

ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన శివకుమార్ ఖోఖో క్రీడలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పాలమూరు యూనివర్సిటీ తరపున ప్రతిభ చాటిన ఆయన, కర్ణాటకలో జరగనున్న ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీల్లో పాల్గొననున్నారు. శివకుమార్ సాధించిన ఈ విజయం పట్ల గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.