News September 13, 2025

ఐఐటీ జామ్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ..!

image

ఐఐటీ జామ్-2026 ప్రవేశ పరీక్షకు గణితశాస్త్రంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు HNK యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణితశాస్త్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొ.డా.టి.నాగయ్య తెలిపారు. మూడేళ్లుగా ఐఐటీ జామ్, పీజీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఐఐటీ జామ్ పరీక్షకు తక్కువ మంది హాజరవుతుండగా ఈనెల 15 నుంచి ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 11, 2026

నేడు తేలనున్న కడియం భవితవ్యం

image

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మడి వరంగల్ టాప్ లీడర్, స్టేషన్ ఘన్పూర్ MLA కడియం శ్రీహరి భవితవ్యం బుధవారం తేలిపోనుంది. ఆయనపై నమోదైన అనర్హత పిటిషన్‌ను ఇప్పటికే విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు అనర్హతపై ఆయన తీర్పును ఇవ్వనున్నారు.

News March 11, 2026

‘పీఎం సేతు’తో ఐటీఐల బలోపేతం: కలెక్టర్ ప్రావీణ్య

image

సంగారెడ్డి జిల్లాలోని ఐటీఐ కేంద్రాలను ఆధునీకరించి, యువతకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘పీఎం సేతు’ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ అధికారులతో సమీక్షించిన ఆమె ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News March 11, 2026

NTR: వచ్చే నెల నుంచే యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు

image

రాష్ట్ర ప్రజలకు యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఆపై రూ.25L వరకు NTR వైద్య సేవ కింద వైద్యం అందిస్తారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 1న ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సుమారు 6 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు టెండర్లలో పాల్గొనగా, ఓ కంపెనీ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో NTR వైద్య సేవ కింద కేటాయించిన రూ.4 వేల కోట్ల నిధులను ఓ బీమా సంస్థకు కేటాయించనున్నారు.