News April 4, 2024

NLG: గుండెపోటుతో వ్యాయామ అధ్యాపకుడి మృతి

image

నల్గొండ ప్రభుత్వ డైట్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు గాదే శౌర్య రెడ్డి ఈరోజు వారి నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఎంతోమందిని వ్యాయామ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది, సమాజానికి కృషి చేసిన వ్యక్తి మరణించడం బాధాకరమని డైట్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. వారి అంత్యక్రియలు మఠంపల్లిలో నేడు జరగనున్నాయి.

Similar News

News March 17, 2026

సాగర్ ఎడమ కాల్వలో మిర్యాలగూడ యువకుడి గల్లంతు

image

మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగెల్లి తరుణ్ (22) బొక్కమంతులపాడు శివారులో సాగర్ ఎడమ కాల్వలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి బట్టలు ఉతకడానికి వచ్చిన అతడు సోమవారం సాయంత్రం ఈత కొడుతుండగా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొట్టుకుపోయినట్లు తెలిపారు. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అన్న మణిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 17, 2026

NLG: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు NLG కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.