News September 13, 2025

MNCL: ఈనెల 22న PLR బోనస్‌పై జేబీసీసీఐ సమావేశం

image

బొగ్గు పరిశ్రమలోని కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా అందించే పనితీరు ఆధారిత రివార్డు (PLR) చెల్లింపుపై ఈనెల 22న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో జేబీసీసీఐ సమావేశం జరగనుంది. ఈ మేరకు కోల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ బెనర్జీ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ గౌతమ్ పొట్రుతో పాటు దేశంలోని బొగ్గు పరిశ్రమల డైరెక్టర్లు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారు.

Similar News

News September 13, 2025

రివర్స్ కండీషనింగ్ గురించి తెలుసా?

image

సాధారణంగా తలస్నానం చేశాక కండీషనర్ రాస్తారు. కానీ ముందుగా కండీషనర్‌ అప్లై చేసి, తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేసే ప్రక్రియను రివర్స్ కండీషనింగ్ అంటారు. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ టెక్నిక్ స్కాల్ప్‌ను క్లీన్ చేసి జుట్టును హెల్తీగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలాగే కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దీనికోసం సల్ఫేట్‌లు, పారాబెన్‌, సిలికాన్‌ లేని మాయిశ్చరైజింగ్ కండీషనర్‌ను ఎంచుకోవాలి.

News September 13, 2025

తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు

image

తిరుపతి వేదికగా ఈనెల 14, 15 తేదీల్లో మహిళా సాధికారత జాతీయ సదస్సు జరగనుంది. తిరుచానూరులోని రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. దేశం నలుమూలల నుంచి 250 మందికిపైగా మహిళా ప్రతినిధులు వస్తున్నారు. ఇందులో మహిళా రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక సాధికారత-పెరుగుతున్న అవకాశాలు, ‘నాయకత్వం, చట్టాల్లో మహిళల పాత్ర’పై వక్తలు ప్రసంగించనున్నారు.

News September 13, 2025

అనకాపల్లి: కుప్పలుగా పడి ఉన్న చనిపోయిన కోళ్లు

image

అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చనిపోయిన బాయిలర్ కోళ్లు దర్శనమిస్తున్నాయి. దేవరాపల్లి మండలం మారేపల్లి శివారు చేనులపాలెం వద్ద రైవాడ కాలువతోపాటు చెరువుల్లో శనివారం చనిపోయిక కోళ్లు కనిపించాయి. పరిసర ప్రాంతాల్లో పౌల్ట్రీ యజమానులు చనిపోయిన వందలాది కోళ్ళను రాత్రి సమయంలో కాలువల్లో వేసి వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.