News September 13, 2025

బార్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. 17 లాస్ట్

image

చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 6 బార్లకు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.18వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో బార్‌ల కేటాయింపు జరుగుతుందన్నారు.

Similar News

News March 10, 2026

గుడిపల్లి : బైక్ నుంచి జారిపడి మహిళ మృతి

image

కుప్పం (M) కృష్ణదాసన పల్లెకు చెందిన షణ్ముగం భార్య సునీత (40) బైక్ నుంచి జారిపడి మృతి చెందింది. సోమవారం భార్యాభర్తలు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లికి వెళుతుండగా గుడిపల్లి (M) శ్రీనివాసపురం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తు సునీత బైక్ నుంచి జారి కింద పడింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. గుడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

గుడిపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

గుడిపల్లి (M) ఆవుల తిమ్మనపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొనడంతో కోడిగాని పల్లెకు చెందిన రాధాకృష్ణ (32) మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణ బైకుపై గ్రామానికి వస్తుండగా కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాధాకృష్ణ మృతి చెందాడు. గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

చిత్తూరు: KGBVల్లో ప్రవేశానికి దరఖాస్తులు

image

చిత్తూరు జిల్లాలోని 7 KGBV బాలికల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో 40 సీట్లు, 7 నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష APC వెంకటరమణ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలుందన్నారు. ఏప్రిల్ 13-17 వరకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు KGBVలోని ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలన్నారు.