News September 13, 2025
విజయవాడ: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CRDA ఇంజినీరింగ్ విభాగంలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 25 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 15 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చీఫ్(4), సూపరింటెండెంట్ ఇంజినీర్(8) పోస్టులు భర్తీ చేస్తున్నామని.. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలన్నారు.
Similar News
News September 13, 2025
విజయవాడ: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా విశాఖ(VSKP)-తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08583 VSKP-TPTY రైలు ఈ నెల 15 నుంచి NOV 24 వరకు ప్రతి సోమవారం, నం.08584 TPTY-VSKP రైలు ఈ నెల 16 నుంచి NOV 25 వరకు ప్రతి మంగళవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడతో పాటు కైకలూరు, గుడివాడలో ఆగుతాయని చెప్పారు.
News September 13, 2025
పల్నాడులో ప్రకంపనలు రేపుతున్న భూ కుంభకోణం

పల్నాడు జిల్లా గురజాలలో సుమారు 1330 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద ఆన్‌లైన్ చేయబడింది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ అక్రమాలకు 2019-24 వరకు గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ కోసం సెప్టెంబర్ 18న పొందుగల సచివాలయంలో ఎంక్వయిరీ సభ నిర్వహించనున్నారు.
News September 13, 2025
KTRకు రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా: మహేశ్

TG: ఫిరాయింపు MLAల విషయంలో రాహుల్‌గాంధీని KTR <<17689238>>ప్రశ్నించడంపై<<>> TPCC చీఫ్ మహేశ్ గౌడ్ ఫైరయ్యారు. ‘MLAలపై రాహుల్ ఎందుకు మాట్లాడాలి? KTR స్థాయి ఏంటి? రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా? కాళేశ్వరంపై విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారు. BJPలో BRS విలీనం గురించి ఇప్పటికే కవిత చెప్పారు’ అని వ్యాఖ్యానించారు.