News September 13, 2025
JRG: వర్జీనియా పొగాకు ధర అధరహో

వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు గరిష్ఠ ధర రూ.411 ఆల్ టైమ్ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యలగూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవరపల్లిలో రూ.416 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 13, 2025
గోదావరిఖని: ఈనెల 23న GOAకు స్పెషల్ బస్

ఈనెల 23న గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ నుంచి గోవా స్పెషల్ ప్యాకేజీ కింద రాజధాని ఏసీ బస్ వెళ్తుందని డీపో మేనేజర్ శుక్రవారం తెలిపారు. మురేడేశ్వర్, గోకర్ణ, గోవాను చూసుకొని 28న బస్సు తిరిగి గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. ఒక్కరికి రూ.8,000లుగా టికెట్ ఛార్జీ నిర్ణయించామన్నారు. రిజర్వేషన్ కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News September 13, 2025
వరంగల్: మత్తు పదార్థాలపై కఠిన చర్యలు

గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా నిల్వపై విశ్వసనీయ సమాచారం అందించాలని వరంగల్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, అమ్మకందారులు లేదా తరలింపులో ఉపయోగించే వాహనాలపై ఎవరైనా సమాచారం కలిగి ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు. దీనికోసం టోల్‌ఫ్రీ నంబర్ 1908 లేదా 87126 71111 ద్వారా అందించవచ్చు అన్నారు.
News September 13, 2025
నెల్లూరు: ఆ బార్లకు రీ నోటిఫికేషన్

జిల్లాలో నిర్వహించకుండా ఓపెన్ కేటగిరిలో ఉన్న 32 బార్లకు, గీత కులాల రిజర్వుడు కింద ఉన్న 1 బార్ కి సంబంధించి రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా నిషేధ, ఎక్సైజ్ శాఖాధికారి తెలిపారు. ఈ నెల 17న దరఖాస్తుల స్వీకరణ, 18 న లాటరీ, ఎంపిక ప్రక్రియలను చేపట్టానున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఈ మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు చేయాలని కోరారు