News September 13, 2025
NGKL: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సల్వాది బాలయ్య గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వ్యక్తి. అచ్చంపేట, సిద్దాపూర్, ఆమనగల్, మహబూబ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య మృతి పట్ల తోటి పోలీసు సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News September 13, 2025
సిరిసిల్ల: సన్నాలకు బోనస్ అందేదెప్పుడు..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు సన్నం వడ్లను సాగు చేశారు. కాగా, వీరంతా రూ.500 బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగిలో సుమారు 10 వేల క్వింటాళ్లకు పైగా సన్నాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు బోనస్ పడలేదు. బోనస్ వస్తే పంట పెట్టుబడికి సాయంగా ఉంటుందని రైతన్నలు అంటున్నారు. ప్రభుత్వ స్పందించి ఖాతాల్లో బోనస్ వేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.
News September 13, 2025
విజయవాడలో రాష్ట్రస్థాయి ఘట్కా పోటీలు ప్రారంభం

కృష్ణా జిల్లా ఘట్కా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో రాష్ట్రస్థాయి ఘట్కా పోటీలు ప్రారంభమయ్యాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరైపోటీలను ప్రారంభించారు. ఘట్కా క్రీడను అభ్యసించడం వల్ల నిజ జీవితంలో ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పోటీలకు హాజరైన క్రీడా కారులను ఉద్దేశించి మాట్లాడినట్లు ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు తెలిపారు.
News September 13, 2025
జనగామ: విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం దిక్సూచి: కలెక్టర్

ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్ విద్య వరకు ప్రతిరోజు 30 నిమిషాలు దిక్సూచి పీరియడ్‌ను రూపొందించినట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య అంటే కేవలం పాఠ్యాంశాల బోధన కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తులో విద్యార్థుల కెరీర్‌కి ఉపయోగపడే వివిధ అంశాలలో పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పిస్తేనే అది సమగ్రమైన విద్య అవుతుందని అన్నారు.