News September 13, 2025

సంగారెడ్డి: 15న T-SAT ద్వారా ప్రత్యక్ష ప్రసారం

image

ఈనెల 15వ తేదీన T-SAT ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రాథమిక విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటలకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని చెప్పారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతారని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2026

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడంటే..!

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి 16 మధ్య నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైం టేబుల్, పూర్తి వివరాలకు https://kru.ac.in/ను చూడాలన్నారు.

News March 18, 2026

రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటలు బయటకు రావొద్దు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో ప.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 18, 2026

ఒంగోలు: దివ్యాంగుల సాధికారతకు ‘శక్తి’ పథకం ప్రారంభం

image

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగుల భరోసా కోసం ‘శక్తి’ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, శిక్షణ, సామాజిక మద్దతు అందించి వారిని స్వయంశక్తితో ఎదిగేలా ప్రోత్సహించనున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని దివ్యాంగుల స్వావలంబనకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.