News September 13, 2025
విజయవాడ: బ్యాంక్ అకౌంట్ ఉందా..ఇది మీ కోసమే

సాధారణ ప్రజలను డబ్బులిచ్చి మభ్యపెట్టి వారి బ్యాంక్ ఖాతాను సైబర్ నేరస్తులకు అప్పగిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తాడి పరశురామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు ముఠాలోని ఇద్దరిని పట్టుకుని బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతా మొత్తం కిట్ ఆ ముఠాకు ఇస్తే రూ.10 వేలు ఇస్తామని నేరస్తుల ముఠా మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 14, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 14, 2026
మంగళగిరిలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష

కుంచనపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆహార భద్రత సూచీలో దేశంలో తొలి 10 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేయాలన్నారు. బాగా పనిచేసేవారిని ప్రోత్సహించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉంటాయన్నారు.
News March 14, 2026
ఇరాన్ అగ్రనేతల సమాచారమిస్తే ₹92Cr రివార్డు

ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వారికి $10m (₹92.5కోట్ల) వరకూ రివార్డు ఇస్తామని యూఎస్ ప్రకటించింది. రక్షణ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. US ప్రకటించిన లిస్టులో సుప్రీం లీడర్ మొజ్తబా సహా మరో 9 మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు US మిలిటరీకి సంబంధించిన సమాచారమిస్తే 150 మిలియన్ ఇరాకీ దినార్లు (₹కోటి) రివార్డుగా ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ ప్రకటించింది.


