News September 13, 2025

కరీంనగర్: కానరాని బొడ్డెమ్మ పండుగ..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే బొడ్డెమ్మ వేడుక కనుమరుగయిపోయింది. కాగా, భాద్రపద బహుళ పంచమి నుంచి ఈ బొడ్డెమ్మ పండుగ మొదలవుతుంది. గ్రామాల్లో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బొడ్డెమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం పట్టణాల్లో అక్కడక్కడ కనిపిస్తున్న బొడ్డెమ్మ వేడుకలు గ్రామాల్లో మాత్రం కనిపించడం లేదు.

Similar News

News March 10, 2026

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై ట్రంప్ రియాక్షన్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ ఎన్నికవడంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు ట్రంప్ అన్నారు. ఆయన సెలక్షన్ వల్ల ఇరాన్ మళ్లీ అదే సమస్య ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అయతుల్లా అలీ ఖమేనీ తరహాలోనే మొజ్తబాను హత్య చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త లీడర్‌గా ఎవరొచ్చినా ఎక్కువ కాలం ఉండబోరని.. వారినీ అంతం చేస్తామని అమెరికా గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.

News March 10, 2026

ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి.. డ్రోన్లతో నిఘా

image

ఖమ్మం మిర్చి మార్కెట్‌కు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. సోమవారం తేజ రకం మిర్చికి గరిష్ఠ ధర రూ. 19,225, మోడల్ ధర రూ. 18,000 నమోదైంది. సూర్యాపేట, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన నిల్వలతో యార్డు నిండిపోయింది. కాంటా పనులు, క్రయవిక్రయాల్లో అక్రమాలు జరగకుండా అధికారులు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం విశేషం. రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.

News March 10, 2026

HYD: PF సమస్యలు ఉన్నాయా? ఇక్కడికి రండి

image

EPFOకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు బాలానగర్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న EPFO కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. PF విత్‌డ్రా, నామినీ యాడ్ చేయడం, KYC అప్‌డేట్, అకౌంట్ సంబంధిత ఇతర సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.