News September 13, 2025

పల్నాడులో విష జ్వరాల విజృంభణ.. ఐదేళ్ల చిన్నారి మృతి

image

వాతావరణంలో మార్పుల కారణంగా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. ముందుగా జలుబు, దగ్గుతో ప్రారంభమై క్రమంగా జ్వరంగా మారుతుందని, చాలా మంది గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో ఐదేళ్ల చిన్నారి నాగలక్ష్మీ విష జ్వరంతో మృతి చెందడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై వైద్య అధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News March 16, 2026

నర్మెట్ట: పీహెచ్‌సీ, కేజీబీవీను తనిఖీ చేసిన కలెక్టర్

image

నర్మెట్ట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో మందుల నిల్వలు, ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలించిన కలెక్టర్, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి వంట గదిని, సరకుల నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.

News March 16, 2026

NLG: 22 నుంచి ఖాతాల్లోకి ‘భరోసా’.. పాస్ బుక్ ఉంటే చాలు..!

image

యాసంగి సాగుకు సంబంధించి ‘రైతు భరోసా’ నిధులను ఈ నెల 22 నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లాలోని 10.50 లక్షల మంది రైతులకు భారీ ఊరట లభించనుంది. ప్రభుత్వం తొలుత సాగులో ఉన్న భూములకే సాయం అందించాలని భావించినా, రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు సాగులో ఉన్నా లేకున్నా, పట్టాదారు పాస్ బుక్ కలిగిన ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయం అందనుంది.

News March 16, 2026

ఆసుపత్రిలో చేరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

image

TG రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ HYDలోని యశోద ఆసుపత్రిలో చేరారు. మంత్రి వైరల్ జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల నిశిత పర్యవేక్షణలో ఉన్నారు. జ్వరం నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు అడ్లూరి లక్ష్మణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో SC, ST సంక్షేమ కార్యక్రమాలను వివరించే బాధ్యతను మంత్రికి అప్పగించారు.