News September 13, 2025

సంగారెడ్డి: డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లు

image

దోస్త్ ద్వారా సంగారెడ్డిలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు ఈనెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అరుణబాయి శుక్రవారం తెలిపారు. ఇంటర్ మెమో, బోనఫైడ్, టీసీ, ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.

Similar News

News March 15, 2026

ఉండవల్లి: సీఎం నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం

image

ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద మంగళగిరికి చెందిన అడిగోపుల క్రాంతి కిరణ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్కింగ్ ప్రాంతంలో తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన ఇల్లు కబ్జా చేశారని, పలుమార్లు లోకేశ్ ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News March 15, 2026

102 ఏళ్ల బామ్మ.. రోజూ మద్యం, మాంసం తీసుకుంటూ..

image

చక్కటి జీవనశైలితోనే ఎక్కువ కాలం జీవిస్తారనే సిద్ధాంతానికి సవాల్ విసురుతున్నారు చైనాకు చెందిన జిన్ బావోలింగ్(102). ఆమె రోజూ పంది మాంసం, కేక్స్, బ్రెడ్స్, బ్రౌన్ షుగర్‌తో కాఫీ, ఆల్కహాల్ తీసుకుంటారు. రోజుకు 15 గంటలు నిద్రపోతారు. కూరగాయలు అరుదుగా తినే బామ్మ ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. గత 50 ఏళ్లలో ఆస్పత్రి మెట్లు ఎక్కలేదని కుటుంబీకులు చెప్పారు. జిన్ స్టోరీ SMలో వైరలవుతోంది.

News March 15, 2026

KTDM: ప్రియుడితో కలిసి భర్త హత్య.. కూతురు చెప్పడంతో వీడిన మిస్టరీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లిలో ఎస్‌డీ జాఫర్ హత్య కలకలం రేపింది. భార్య ఖతీజా ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసి మద్యం తాగడంతో చనిపోయాడని, సహజ మరణంగా చిత్రీకరించింది. అంత్యక్రియల తర్వాత ఎనిమిదేళ్ల కుమార్తె చెప్పిన వివరాలతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.