News September 13, 2025
కామారెడ్డి జిల్లాలో వర్షపాతం వివరాలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. బొమ్మన్‌దేవిపల్లి 39.8 మి.మీ., నస్రుల్లాబాద్ 29.5, పుల్కల్ 14.8, పిట్లం, బీర్కూర్ 14, డోంగ్లి 12.5, కొల్లూరు 11.5, ఇసాయిపేట 10.8, రామారెడ్డి 10, మేనూరు 9.5, పెద్ద కొడప్గల్ 9, బిచ్కుంద 6.5, పాత రాజంపేట 5.5, IDOC(కామారెడ్డి) 5.3, సర్వాపూర్ 4.8, మాక్దూంపూర్ 3.5, జుక్కల్ 3.3, వెల్పుగొండ 2.8 మి.మీ. వర్షం పడింది.
Similar News
News March 14, 2026
విశాఖలో నియోజకవర్గ వైసీపీ పరిశీలకుల నియామకం

విశాఖలోని అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా పలువురుని వైసీపీ కేంద్రపార్టీ కార్యాలయం నియమించింది.
➤ విశాఖ నార్త్: చింతకాయల సన్యాసి పాత్రుడు
➤ విశాఖ సౌత్: వీసం రామకృష్ణ
➤ విశాఖ వెస్ట్: జాహీర్ అహ్మద్
➤ విశాఖ ఈస్ట్: పేడాడ రమణి కుమారి
➤ గాజువాక: పసుపులేటి బాలరాజు
➤ భీమిలి: తైనాలా విజయ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
News March 14, 2026
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు: ఎస్పీ గీతే

సిరిసిల్ల జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ మహేశ్ బి.గీతే తెలిపారు. శనివారం సిరిసిల్లలోని పలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 14, 2026
నెల్లూరు జిల్లాలో పెరిగిన నూనె ధరలు

యుద్ధ ప్రభావం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వంట నూనె ధరలు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ.10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకు పైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.


