News September 13, 2025
బెల్లంపల్లి: ఎన్‌కౌంటర్‌లో మావో వెంకటి మృతి

బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన మావోయిస్టు నాయకుడు జాడి వెంకటి ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో గురువారం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 1996లో అజ్ఞాతంలోకి వెళ్లిన వెంకటి, పార్టీలో కీలక పాత్ర పోషించారు. జాడి పోచమ్మ-ఆశయ దంపతులకు ఒక్క కుమారుడు కావడంతో కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. తహశీల్దార్ కార్యాలయంలో సుంకరిగా పనిచేస్తూ మావో కొరియర్‌గా పనిచేశాడని స్థానికులు తెలిపారు.
Similar News
News September 13, 2025
రేపే దాయాదుల పోరు.. సగం టికెట్లే సేల్!

UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌పై భారత అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరిగే ఇండియా VS పాకిస్థాన్‌ను బైకాట్ చేయాలంటూ భారత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సిన దాయాదుల మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ సగం కూడా అమ్ముడవలేదని సమాచారం. అమ్మకాలను పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు కూడా తగ్గించారట. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.
News September 13, 2025
నిద్రలోనే చనిపోయిన 19 మంది స్టూడెంట్స్

మయన్మార్‌లో అంతర్గత ఘర్షణలకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి రఖై రాష్ట్రంలోని క్యాక్తాలో రెండు ప్రైవేట్ స్కూళ్లపై డ్రోన్ల దాడి జరగడంతో 19 మంది స్టూడెంట్స్ నిద్రలోనే కన్నుమూశారు. 22 మంది గాయపడినట్లు అరాకన్ ఆర్మీ తెలిపింది. డ్రోన్లతో బాంబులను జారవిడిచారని, ఇది మయన్మార్ మిలిటరీ పనేనని ఆరోపించింది. కాగా కొన్నాళ్లుగా అరాకన్ ఆర్మీ, మయన్మార్ మిలిటరీ మధ్య ఘర్షణ జరుగుతోంది.
News September 13, 2025
విజయవాడ-మచిలీపట్నం రహదారిపై యాక్సిడెంట్

మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారి తారకటూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూటిపై వెళ్తున్న యువకులు ఇటుకల లోడుతో ఉన్నా ట్రాక్టర్‌ని ఢీకొట్టారన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందాగా మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.