News September 13, 2025
6 లైన్ల రోడ్డు: బీచ్ రోడ్ To భోగాపురం.. వయా భీమిలి..!

భోగాపురం ఎయిర్‌పోర్టుతో సిటీకి కనెక్టెవిటీ పెంచేందుకు బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రోడ్డు స్థానిక రాజకీయ నాయకుల భూమి విలువలు పెరగడానికి అవకాశం కల్పించిందని విమర్శలొచ్చాయి. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలోనే రోడ్డు నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాల సమాచారం.
Similar News
News September 13, 2025
రూ.1.91 కోట్లు పలికిన ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ టెండర్

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ నిర్వహణను బాక్స్ టెండర్‌లో రూ.1.91,44,000లకు శివకుమార్ దక్కించుకున్నాడు. శుక్రవారం ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ టెండర్లను కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఓపెన్, బాక్స్ టెండర్లను నిర్వహించారు. ఓపెన్ టెండర్‌లో సాకే పెద్దిరాజు రూ.1.76 కోట్లకు, బాక్స్ టెండర్‌లో శివకుమార్ రూ.1.91 కోట్లకు బిడ్ వేశారు.
News September 13, 2025
విజయవాడ దుర్గగుడిలో రూ.500 టికెట్ల రద్దు?

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.500 అంతరాలయ దర్శనం టిక్కెట్లను రద్దు చేసే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. గత దసరా ఉత్సవాలలో ఈ టికెట్లు తీసుకున్న భక్తులను ప్రధాన ద్వారం నుంచే దర్శనం చేయించి పంపించారు. గతేడాది ఈ టికెట్ల ద్వారా ఆలయానికి రూ.2.30 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి కేవలం రూ. 300 టికెట్లను మాత్రమే విక్రయిస్తారని సమాచారం.
News September 13, 2025
HYD: జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పనిచేయాలి: MD

HYD నగరంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ CMD ముషారఫ్ ఫారూఖీ 180 అసిస్టెంట్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీరో శాతం ఫిర్యాదులే లక్ష్యంగా వారంలో కనీసం రెండు సార్లు బస్తీలు, కాలనీలను పర్యటించాలని చెప్పారు. విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించి వినియోగదారుల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యను పరిష్కరించాలని అన్నారు.