News September 13, 2025
విశాఖ బీచ్ రోడ్ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు 6 లైన్ల రోడ్డు!

AP: విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలో వేగవంతమైన రోడ్డుతో అనుసంధానించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమిలి-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల స్థలాలకు అనుకూలంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.
Similar News
News March 4, 2026
తమిళనాట DMK-INC సీట్ల పంచాయితీ కొలిక్కి!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ DMK-INC మధ్య సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. INCకి 28-29 స్థానాలతోపాటు ఓ రాజ్యసభ సీటు ఇచ్చేందుకు DMK చీఫ్ స్టాలిన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు INC చీఫ్ ఖర్గే కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుందని పేర్కొన్నాయి. ఈసారి 35-40 సీట్ల కోసం కాంగ్రెస్ డిమాండ్ చేసిన విషయం <<19222432>>తెలిసిందే.<<>>
News March 4, 2026
రూ.10వేల శాలరీ.. రూ.300 కోట్లు హవాలా స్కామ్

అహ్మదాబాద్‌లో నకిలీ బ్యాంకు ఖాతాలతో అక్రమ క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో చేసిన ₹550Cr హవాలా స్కామ్ బయటపడింది. నెలకు ₹10-12k సంపాదించే ర్యాపిడో డ్రైవర్ ప్రదీప్ ఖాతాలో ₹300Cr లావాదేవీలను ED గుర్తించి లోతుగా దర్యాప్తు చేసింది. తన బ్యాంకు ఖాతాను కిరణ్ అనే వ్యక్తికి ₹25Kకు అద్దెకు ఇచ్చినట్లు ప్రదీప్ అంగీకరించారు. అసలైన నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
News March 4, 2026
త్వరలో ఢిల్లీకి కేసీఆర్?

TG: రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై మౌనంగా ఉన్న BRS చీఫ్ KCR త్వరలో పూర్తిస్థాయిలో యాక్టివ్ కానునట్లు తెలుస్తోంది. APRలో ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. త్వరలో జరిగే TN, WB, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాల రాజకీయ మిత్రులను కలుస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. CMలు స్టాలిన్, మమత, పినరయ్ విజయన్‌లతో KCRకు మంచి సంబంధాలున్నాయి. ఢిల్లీలో BRS ఆఫీసునూ సందర్శిస్తారు.


