News September 13, 2025

బాపట్ల – కృష్ణా జిల్లాల మధ్య వివాద పరిష్కారం

image

బాపట్ల, కృష్ణా జిల్లాల సరిహద్దు మధ్య ఉన్న నీటి వివాదాన్ని అధికారులు శుక్రవారం పరిష్కరించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచనల మేరకు ఆయన సోదరులు శివప్రసాద్, రేపల్లె ఆర్డిఓ రామలక్ష్మి, మచిలీపట్నం ఇన్‌ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి ఇరు జిల్లాల ప్రజలతో చర్చించారు. అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.

Similar News

News March 14, 2026

షాకింగ్.. నెల్లూరు జిల్లాలో భారీగా పెరిగిన ధరలు

image

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లా నుంచి నిమ్మ, గుడ్లు ఎగుమతులు పడిపోయాయి. దీంతో వాటి ధరలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో చికెన్ ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా నెల్లూరులో శనివారం బాయిలర్ కోడి ధర రూ.175 పలికింది. స్కిన్‌తో కూడిన కేజీ చికెన్ రూ.304, స్కిన్ లెస్ రూ.334గా ఉంది. డిసెంబర్, జనవరిలో కోళ్లకు వైరస్ వచ్చి చనిపోవడంతో ధరలు పెరిగాయని.. రంజాన్‌కు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

News March 14, 2026

కర్నూలు జిల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

జోహారాపురం సచివాలయంలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. ఈ పథకం కింద కర్నూలు జిల్లాలోని 2,72,757 మంది అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ.154.94 కోట్లు జమ చేసిందని కలెక్టర్ తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె వివరించారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.6వేలు జమవుతుందని తెలిపారు.

News March 14, 2026

శ్రీకాకుళం: టెన్త్ పరీక్షా కేంద్రం తెలుసుకోవాలా..QR కోడ్ మీ కోసమే

image

​పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని శ్రీకాకుళం DEO ఎ. రవిబాబు శుక్రవారం తెలిపారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా హాల్‌టికెట్లపై (QR) కోడ్‌ను అందిస్తున్నామన్నారు. మొబైల్‌లో దీన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, పాఠశాల చిత్రం కనిపిస్తాయని పేర్కొన్నారు.