News September 13, 2025
చర్లపల్లి-తిరుపతి ట్రైను అక్టోబర్‌లో ప్రారంభం

చర్లపల్లి-తిరుపతి రైలు వారానికి ఒక రోజు నడవనుంది. అక్టోబర్ 8 నుంచి ప్రతి బుధవారం చర్లపల్లిలో ప్రత్యేక రైలు తిరుపతికి ప్రారంభమవుతుంది. నడికుడి, పిడుగురాళ్ల, నెమలిపురి, రొంపిచర్ల, వినుకొండ, మార్కాపురం, కంభం, నంద్యాల స్టేషన్లలో ఆగుతుంది. తిరుపతి నుంచి ప్రతి గురువారం చర్లపల్లికి ప్రారంభమవుతుంది. గత సర్వీస్ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దుచేసి నూతన ట్రైన్‌ను నడిపేందుకు నిర్ణయించారు.
Similar News
News March 5, 2026
30 రోజుల వరకే గ్యాస్ నిల్వలు.. ధరలు పెరిగే ఛాన్స్!

LNG ఉత్పత్తిని ఖతర్ నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిలో రాకపోకలు ఆగిపోవడం వల్ల ఇండియాపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం దేశంలో 30 రోజులకు సరిపడా LPG స్టాక్ మాత్రమే ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘LPG అవసరాలలో 80-85% దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ వాటా గల్ఫ్‌దే. మనకు ప్రత్యామ్నాయ సరఫరాదారులూ లేరు. ఈ నెల రావాల్సిన గ్యాస్ ఆలస్యమైతే ఇబ్బందులు తప్పవు. రేట్లు పెరిగే అవకాశం ఉంది’ అని పేర్కొన్నాయి.
News March 5, 2026
SKLM: ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 227 మంది గైర్హాజర్

శ్రీకాకుళం జిల్లాలో 6 పరీక్ష కేంద్రాల్లో గురువారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 227 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు హిందీ పరీక్షలకు సంబంధించి 929 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా..702 మంది మాత్రమే రాశారు అన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా 2 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 6 సెట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
News March 5, 2026
KMR: రేపు జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవం: డీఈఓ

ఈ నెల 6న జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవం నిజాంసాగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు తెలిపారు. జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఒక బాలిక, ఒక బాలున్ని ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపించాలని ఉపాధ్యాయులను కోరారు. ‘వికసిత భారత్-అందులో నా భాగస్వామ్యం’ అన్న అంశంపై పలురకాల పోటీలు నిర్వహించారు. ఎంపిక చేసి పీఎం చదువుకున్న పాఠశాల గుజరాత్‌కు పంపిస్తామన్నారు.


