News September 13, 2025

ఏలేశ్వరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఏలేశ్వరం డిగ్రీ కళాశాల సమీపంలో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు కళాశాల వద్దకు లేదా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలియజేయాలని పోలీసులు కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, వివరాలను సేకరిస్తున్నారు.

Similar News

News March 22, 2026

SKLM: ప్రతీ జర్నీ ప్రశాంతంగా సాగాలి: మంత్రులు

image

ప్రతీ జర్నీ ప్రశాంతంగా సాగాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణకూడలి నుంచి పెద్దపాడు జంక్షన్ వరకూ ప్లాంటేషన్, ఆధునీకరించిన నూతన రహదారి, సెంట్రల్ లైటింగ్‌‌ను శనివారం రాత్రి వారు ప్రారంభించారు. రూ.3.68కోట్ల సుడా నిధులతో ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. నగరానికి మరింత శోభ వచ్చిందన్నారు. కలెక్టర్, MLA శంకర్ ఉన్నారు.

News March 22, 2026

F-16 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చిందా?

image

ఇరాన్ ఎయిర్‌స్పేస్‌లో జరిగిన ఆపరేషన్‌లో తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇజ్రాయెల్‌కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయని IRGC ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ ఈ వాదనను కొట్టిపారేసింది. తమ విమానంపై క్షిపణి దాడి జరిగిన మాట వాస్తవమేనని, కానీ పైలట్లు సేఫ్‌గా మిషన్‌ను పూర్తి చేసి తిరిగి వచ్చారని స్పష్టం చేసింది. విమానానికి ఎలాంటి డ్యామేజ్ కాలేదని పేర్కొంది.

News March 22, 2026

విజయవాడలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

image

విజయవాడలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్క్రూ బ్రిడ్జి నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్తున్న ఓ టాటా ఏస్ వాహనం స్పీడ్ బ్రేకర్ వద్ద వేగాన్ని తగ్గించింది. ఆ సమయంలో పక్కన ఓ కారు సైతం ఉంది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా కారు.. ముందున్న రెండు వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు శ్రీశైలం నుంచి గుడివాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.