News September 13, 2025
ములుగు: కనుమరుగవుతున్న బతుకమ్మ పాటలు!

బతుకమ్మ పండుగకు ఓరుగల్లు పెట్టింది పేరు. ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకునే సంబురం. 9 రోజులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఒక్కచోట చేరి జరుపుకునే పండుగ. కానీ, కొన్నేళ్లుగా బతుకమ్మ పాటలు, సంస్కృతి కనుమరుగవుతోంది. డీజేలు, వల్గర్ పాటలతో పండుగ అర్దాన్ని మారుస్తున్నారు. వింత పోకడలు, అర్థం పర్థం లేని పాటలు, విచిత్ర డాన్సులతో పూల పండుగ భవిష్యత్తు తరాలకు తెలియకుండా పోతుంది. కాగా, ఈనెల 22న ఎంగిలి పూల బతుకమ్మ.
Similar News
News March 10, 2026
తెల్లవారుజామున కవిత అరెస్టు

ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఖమ్మం అంబేడ్కర్ భవన్ వద్ద డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి ఆమె దీక్షకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ వైపు తరలించారు. పోలీసులకు, బాధితులకు మధ్య తోపులాట జరగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
News March 10, 2026
లిక్కర్ కేసులో A15కి ఊరట.. జోగి రమేశ్ సోదరులకు నిరాశ

విజయవాడ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A15 నిందితుడిగా ఉన్న తాండ్ర రమేష్‌కు విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరుల బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ ఇచ్చేందుకు నిందితుల తరపు న్యాయవాది సమయం కోరడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
News March 10, 2026
నల్గొండ: బర్డ్ ఫ్లూ భయం.. అధికారి క్లారిటీ

నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఆనవాళ్లు లేవని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు. జిల్లాలో కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని, ఎక్కడా చనిపోయినట్లు ఫిర్యాదులు అందలేదని ఆయన తెలిపారు. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.


