News September 13, 2025

అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు

image

అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగించారు. రాయచోటి 1, మదనపల్లె 1, పీలేరు 1 చొప్పున బార్లకు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత సమయానికి ముందుగా అబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. లాటరీ పద్ధతిలో కేటాయింపు 18వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ PGRS హాల్లో నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News March 21, 2026

గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: మంత్రి నాదెండ్ల

image

రాష్ట్రంలో గ్యాస్ కొరత అపోహలపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 2.96 లక్షల బుకింగ్స్ రాగా 2.78 లక్షల డెలివరీలు పూర్తి చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా రూమర్స్ వల్లే అధిక బుకింగ్స్ జరుగుతున్నాయని, 26న విశాఖకు LPG నౌక చేరుకుంటుందని సరఫరా మరింత మెరుగవుతుందన్నారు. గ్యాస్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News March 21, 2026

మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత

image

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కలెక్టర్‌గా ఆమె ఈ ఘనత సాధించనున్నారు.

News March 21, 2026

పోలవరం జిల్లా మొదటి కలెక్టర్ ఈయనే..!

image

పోలవరం జిల్లా నూతన కలెక్టర్‌గా దినేశ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయుష్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన, ఇకపై పోలవరం జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి అల్లూరి జిల్లా కలెక్టర్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు దినేశ్ కుమార్ మొదటి పూర్తిస్థాయి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.