News September 13, 2025

HYD: నేడు, రేపు MSME బిజినెస్ ఎక్స్‌పో

image

BNI హైదరాబాద్ ప్రతినిధులు అనిరుధ్ కొణిజేటి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సెప్టెంబర్ 13, 14న శంషాబాద్‌లో MSME ఎక్స్‌పో నిర్వహిస్తామని తెలిపారు. BNI ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్‌పోలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించబడనున్నట్లు వివరించారు. ఎక్స్‌పో విశేషాలను సీఎంకు వివరిస్తామని చెప్పారు.

Similar News

News March 17, 2026

తిరుపతి ఐఐటీతో ఒప్పందం

image

తిరుపతి ఐఐటీ, మానేక్‌షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అండ్ రీసెర్చ్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశోధన, అభివృద్ధి, విద్య, శిక్షణ రంగాల్లో సహకారం పెంపొందుతుంది. సాయుధ దళాలు, జాతీయ భద్రతా సంస్థలకు నిపుణుల మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం అందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్ష రంగాల్లో పరిశోధనలకు మార్గం సుగమం అవుతుంది.

News March 17, 2026

NRPT: మధ్యాహ్న భోజన పథకం మెనూ వంద శాతం అమలు చేయాలి

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ శాఖల వసతి గృహాలలో మధ్యాహ్న భోజన పథకం మెనూ కచ్చితంగా వంద శాతం అమలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజనానికి వినియోగించే బియ్యం, ఇతర వంట సరకులు పూర్తి స్థాయిలో నాణ్యతతో కూడినవి వినియోగించాలన్నారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని సూచించారు.

News March 17, 2026

తీర ప్రాంత రిసార్ట్స్‌కు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్: కలెక్టర్

image

తీర ప్రాంత రిసార్ట్స్‌లకు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ అమలు చేసి ర్యాంకులు ఇస్తామని బాపట్ల కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణహిత పారిశుద్ధ్య చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.