News September 13, 2025
కిలో టమాటా రూ.4

నిన్న, మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా రేటు ఒక్కసారిగా పడిపోయింది. కర్నూలు(D) పత్తికొండ, నంద్యాల(D) ప్యాపిలి మార్కెట్లలో కిలో రూ.4 నుంచి రూ.6 మాత్రమే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు పొలాల్లోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొందరు రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.30కి అమ్ముతున్నారు.
Similar News
News September 13, 2025
హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాలు

HYDలోని మిశ్ర ధాతు నిగమ్<
News September 13, 2025
అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఆనంద్ శనివారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలకు సూచించారు.
News September 13, 2025
మాజీ మంత్రి శైలజానాథ్‌కు అస్వస్థత

మాజీ మంత్రి, వైసీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నా ఈనెల 9న జరిగిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.