News September 13, 2025
పార్వతీపురం మన్యం జిల్లాకు చేరుకున్న కొత్త కలెక్టర్

ఇటీవల బదిలీపై పార్వతీపురం మన్యం జిల్లాకు కలెక్టర్‌గా నియమించబడ్డ ప్రభాకర్ రావు కలెక్టరేట్‌కు శనివారం చేరుకున్నారు. ఆయనకు పలువురు అధికారులు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో సమస్యలు గుర్తించి వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తామన్నారు.
Similar News
News September 13, 2025
తగ్గిన సబ్బులు, షాంపూల ధరలు

GST సవరణ నేపథ్యంలో ప్రముఖ FMCG బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తమ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. రూ.490 ఉండే డవ్ షాంపూ(340ml) రూ.435కే లభించనుంది. రూ.130 హార్లిక్స్ జార్(200g) రూ.110, రూ.68 లైఫ్‌బాయ్ సబ్బు(75gX4) రూ.60, రూ.96 లక్స్ సబ్బు(75gX4) రూ.85, రూ.300 బ్రూ (75g) రూ.284, రూ.124 బూస్ట్(200g) రూ.110, రూ.154 క్లోజప్ (150g) రూ.129కే అందుబాటులో ఉంటాయి. ఈ నెల 22 నుంచి ఈ ధరలు అమలవుతాయి.
News September 13, 2025
HYD: అందరూ ఈ 9000113667 నంబర్ సేవ్ చేసుకోండి..!

గ్రేటర్ HYDలో మూతలేని మ్యాన్ హోళ్లు చాలా చోట్ల మీకు కనిపిస్తాయి. అందులో ఎవరైనా పడి ప్రమాదాలకు గురి కావచ్చు. అందుకే మూతలేని మ్యాన్ హోల్‌ను మీరు చూస్తే వెంటనే 9000113667 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారమివ్వండి. హైడ్రా అధికారులు తక్షణం స్పందించి దానికి మూతను ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ విషయం మీ మిత్రులు, సన్నిహితులకు కూడా షేర్ చేయండి. SHARE IT
News September 13, 2025
కరీంనగర్: సీఐపై చర్యలు తీసుకోండి: ఏబీవీపీ

ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో మహిళా అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేసిన మహిళ సిఐ శ్రీలతపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ టౌన్ ఏసీపీకి ఏబీవీపీ నాయకులు పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, రాకేష్, విష్ణు తదితరులు ఉన్నారు.