News September 13, 2025
VJA: ఫుడ్ పాయిజనే కారణమా?

బయట వేయించిన చికెన్, చేపలు, ఇతర ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి డయేరియా వ్యాప్తికి కారణమని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇవి బాధితులు చెప్పిన విషయాలు మాత్రమేనని, నిర్ధారణ కోసం పంపిన ఫుడ్ శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రాలేదని సమాచారం. డయేరియా అదుపులోనే ఉందని ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపిణలూ వినిపిస్తున్నాయి. కేసులు పెరుగుతున్నా అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
Similar News
News March 11, 2026
‘హార్ముజ్’లో నావల్ మైన్స్? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్‌ను ఏర్పాటు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ‘ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నావల్ మైన్స్ ఏర్పాటు చేసినట్లయితే వెంటనే తొలగించాలి. లేదంటే ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో మిలిటరీ చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు. కాగా ‘హార్ముజ్’ గుండా ఆయిల్ ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేసినట్లు US నేవీ SMలో పోస్ట్ చేసి డిలీట్ చేయగా, ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేయలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
News March 11, 2026
కరీంనగర్‌లో ‘ఈ-ఆఫీస్’ సేవలు ప్రారంభం

పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో ఫైళ్లను, ప్రజల ఫిర్యాదులను ఆన్‌లైన్ ద్వారానే వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పారదర్శక పాలన కోసమే ఈ డిజిటల్ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
News March 11, 2026
సంగారెడ్డి: 12న మున్సిపల్ ప్రజాప్రతినిధులకు శిక్షణ

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు చెందిన నూతన ఛైర్మన్లు, కౌన్సిలర్లకు ఈనెల 12న శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టం-2019పై ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


