News September 13, 2025

విజయవాడ నుంచి పలాసకు సూపర్ లగ్జరీ బస్సులు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుండి పలాసకు ప్రతి రోజూ సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 2.30, సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సులు మరుసటి రోజు ఉదయం 4, 7.30కు పలాస చేరుకుంటాయని, తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5.20, 6,15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6, 7 గంటలకు విజయవాడ చేరుకుంటాయని, ప్రయాణికులు ఈ సర్వీసులను ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.

Similar News

News March 17, 2026

VJA: మృత్యుపాశంలా రహదారులు.. 2 రోజుల్లో నలుగురి మృతి!

image

విజయవాడలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బైపాస్ వద్ద ప్రొఫెసర్, ఎనికేపాడులో వృద్ధుడు, నున్నలో ఒక యువకుడితో పాటు, మహానాడు రోడ్డులో వాచ్‌మెన్ దుర్మరణం చెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ విషాదాలకు కారణమని తెలుస్తోంది.

News March 17, 2026

గద్వాల: రైలు ఆలస్యం.. ముగ్గురు విద్యార్థుల జీవితాల్లో విషాదం

image

గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో <<19404491>>ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొన్న ఘటన<<>>లో ముగ్గురు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. అయిజకు చెందిన రాము(17) అక్కడికక్కడే మృతి చెందాడు. మిట్టదొడ్డికి చెందిన విష్ణు, గంజిపేటకి చెందిన వర్ధన్ తీవ్ర గాయాలు కావడంతో వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వెళ్లేందుకు రైలు టికెట్లు తీసుకున్న వీరు.. రైలు ఆలస్యంతో బైక్‌‌పై బయటికి రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News March 17, 2026

జగిత్యాల: పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి నిర్ణయం.. సంజయ్ కామెంట్స్

image

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ మీడియా చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి పార్టీని వీడాలని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఎల్.రమణతో కలిసి పనిచేశానని, అలాగే జీవన్ రెడ్డితో కూడా కలిసి పని చేస్తానని తెలిపారు. ఎల్.రమణలాంటి నాయకులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని, అలాంటి నిర్ణయాల్లో జరిగిన తప్పిదాల వల్లనే BRS మళ్లీ అధికారంలోకి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.