News September 13, 2025

అహంకారం వినాశనానికి కారణం

image

రావణుడు విద్యావంతుడు, గొప్ప పండితుడు, శివ భక్తుడు. ఆయనకు పాలనలోనూ మంచి పరిజ్ఞానం ఉంది. అయితే, అహంకారం, దుర్గుణాలు ఆయన పతనానికి కారణమయ్యాయి. ధర్మం బోధించిన భార్య మండోదరి మాటలను సైతం రావణుడు పెడచెవిన పెట్టాడు. తన అహంకారం కారణంగా సీతను అపహరించి, చివరకు తన సామ్రాజ్యాన్ని కోల్పోయి, నాశనమయ్యాడు. ఎంత గొప్ప వ్యక్తికైనా దుర్గుణాలు, అహంకారం అపారమైన నష్టాన్ని కలిగిస్తాయని రావణుడి జీవితం తెలియజేస్తోంది.

Similar News

News September 13, 2025

తగ్గిన సబ్బులు, షాంపూల ధరలు

image

GST సవరణ నేపథ్యంలో ప్రముఖ FMCG బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తమ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. రూ.490 ఉండే డవ్ షాంపూ(340ml) రూ.435కే లభించనుంది. రూ.130 హార్లిక్స్ జార్(200g) రూ.110, రూ.68 లైఫ్‌బాయ్ సబ్బు(75gX4) రూ.60, రూ.96 లక్స్ సబ్బు(75gX4) రూ.85, రూ.300 బ్రూ (75g) రూ.284, రూ.124 బూస్ట్(200g) రూ.110, రూ.154 క్లోజప్ (150g) రూ.129కే అందుబాటులో ఉంటాయి. ఈ నెల 22 నుంచి ఈ ధరలు అమలవుతాయి.

News September 13, 2025

హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాలు

image

HYDలోని మిశ్ర ధాతు నిగమ్<>(మిధాని<<>>) 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 24వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్/బీఈలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత, కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

News September 13, 2025

యుద్ధం తర్వాత తొలి మ్యాచ్.. స్టేడియం హౌస్‌ఫుల్: అక్తర్

image

ఆసియా కప్‌లో రేపు భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు టికెట్స్ సేల్ అవ్వట్లేదన్న వార్తలపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్ధం తర్వాత భారత్‌తో పాక్ తొలిసారి తలపడుతోంది. కచ్చితంగా స్టేడియం హౌస్‌ఫుల్ అవుతుంది. టికెట్లు అమ్ముడవ్వట్లేదని నాతో ఒకరన్నారు. అది వాస్తవం కాదని, అన్నీ సేల్ అయ్యాయని చెప్పాను. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు.