News September 13, 2025
విజయవాడలో స్క్వాష్, బాక్సింగ్ జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-14, అండర్-17 బాల బాలికల బాక్సింగ్, స్క్వాష్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొనే క్రీడా కారులు తమ స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో ఉదయం 9 గంటల కల్లా హాజరు కావాలని ఎస్టీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు.
Similar News
News September 13, 2025
నంద్యాల SP అదిరాజ్ సింగ్ రాణా బదిలీ

నంద్యాల SP అదిరాజ్ సింగ్ రాణా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సునీల్ షెరాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
News September 13, 2025
NRPT: ఆశ, అత్యాశే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు

ప్రజల ఆశే సైబర్ నేరగాళ్లు బలహీనతగా భావించి ఆర్థిక నేరాలకు పాల్పడతారని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. విలాసవంతమైన వస్తువులు ఇస్తామని విదేశీ యాత్రలకు పంపుతామని ఆఫర్లను ప్రకటించి ఖాతాలో డబ్బులు జమ చేయాలంటూ వచ్చే ఫోన్ కాల్స్ నమ్మకండని హెచ్చరించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీముల జోలికి వెళ్లకూడదని చెప్పారు. APK ఫైల్స్ ఓపెన్ చేయకూడదని, అపరిచితులకు బ్యాంకు ఖాతా, ఓటిపి వివరాలు ఇవ్వకూడదని అన్నారు.
News September 13, 2025
HYD: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క ఈరోజు HYDలో పోలీసులు ఎదుట లొంగిపొయింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా సుజాతక్క ఉన్నారు. గద్వాల్‌కు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన 1984లో కిషన్‌జీని వివాహం చేసుకుంది. మొత్తం 106 కేసుల్లో సుజాతక్క నిందితురాలిగా ఉంది. మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవచ్చని డీజీపీ జితేందర్ సూచించారు.