News September 13, 2025
KNR: నేను చేయగలనా కాదు.. నేను చేస్తాను..!

పాజిటివ్ థింకింగ్.. మనిషికి ఉండాల్సిన మంచి లక్షణాల్లో ఇదోటి. ఈ గుణం ఉంటే చాలు ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా ఎదిరించవచ్చని సూచిస్తున్నారు సైకాలజిస్టులు. ప్రస్తుత ప్రపంచంలో మనమెంత మంచిపని చేసినా దాంట్లో తప్పును వెతికేవారే ఎక్కువయ్యారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మేలంటున్నారు మానసిక నిపుణులు. నిత్యం సానుకూల ఆలోచనలతో ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యుషన్ ఉంటుందంటున్నారు. # నేడు పాజిటివ్ థింకింగ్ డే.
Similar News
News March 4, 2026
డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, SPSR నెల్లూరులో ఉద్యోగాలు

<
News March 4, 2026
గుంటూరు: గుడారాల పండగకు ప్రత్యేక రైళ్లు

గుడారాల పండగ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 8 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. నం.17258 కాకినాడపోర్టు – విజయవాడ, నం.67229/67230 విజయవాడ గుంటూరు, గుంటూరు విజయవాడ, నం17257 విజయవాడ – కాకినాడ పోర్ట్, ఈ రైళ్లను ఆయా తేదీలలో నడపనున్నట్లు ప్రకటించారు.
News March 4, 2026
ఖమ్మం: మొక్కజొన్న రైతులకు దక్కని భరోసా

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. క్వింటా మద్దతు ధర రూ.2,400 ఉండగా, బయట మార్కెట్లో దళారులు రూ.1,900కే కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చేలోపే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. ఆలస్యంగా కేంద్రాలు తెరిస్తే దళారులకే లాభమని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.


