News September 13, 2025
1GB ప్లాన్ ఎత్తేయడంపై వివరణ కోరిన TRAI

సరసమైన 1GB ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉపసంహరణకు గల కారణాలను తెలపాలని JIO, AIRTEL సంస్థలను TRAI కోరింది. రూ.249 ప్లాన్ ఎత్తేయడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని JIO తెలుపగా.. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూ.249 ప్లాన్‌ను తీసేసినట్లు AIRTEL పేర్కొంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹299 నుంచి మొదలుకానుంది.
Similar News
News September 13, 2025
రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ ఎస్తర్?

హీరోయిన్ ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెల్ల రంగు గౌను ధరించి ఆమె SMలో ఓ పోస్ట్ చేశారు. ‘జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజున నాపై ప్రేమ, ఆశీర్వాదాలు కురిపిస్తున్న మీ అందరికీ స్పెషల్ థాంక్స్. త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేస్తా’ అంటూ రాసుకొచ్చారు. కాగా సింగర్ నోయల్, ఎస్తర్ 2019లో లవ్ మ్యారేజ్ చేసుకుని, 6 నెలల్లోపే విడిపోయారు.
News September 13, 2025
భోగాపురం దాదాపు పూర్తయినట్లే: కేంద్ర మంత్రి రామ్మోహన్

AP: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాలు కురుస్తున్నా GMR సంస్థ పనులు ఆపడం లేదన్నారు. విజయనగరంలో విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ‘వచ్చే ఏప్రిల్‌లోగా వైజాగ్ నుంచి రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తాం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. బీచ్ కారిడార్ కోసం ఇప్పటికే DPR సిద్ధం చేశాం’ అని వివరించారు.
News September 13, 2025
షూటింగ్‌లు చేసేందుకు కాదు మీకు ఓటేసింది: పవన్‌పై రోజా ఫైర్

AP: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను Dy.CM పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ప్యాకేజీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నారని YCP నేత రోజా విమర్శించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు పవన్ మద్దతివ్వడం దారుణమన్నారు. ‘ఆయనకు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. Dy.CM స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రభుత్వ ధనం వృథా చేస్తున్నారు. షూటింగ్‌లు చేసుకునేందుకు కాదు ప్రజలు ఆయనకు ఓట్లేసింది’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.