News September 13, 2025

నకిరేకల్‌లో విద్యార్థినికి లైంగిక వేధింపులు..!

image

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ టీచర్ విద్యార్థినిని వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయాన్ని బయటపెట్టకుండా రాజీ చేసేందుకు కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రయత్నించినట్లు తెలిసింది. బాధితురాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News March 17, 2026

జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి

image

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని(PCC) జగ్గారెడ్డికి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ.. జగ్గారెడ్డికి మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉందని, ఆయన మరో పీజేఆర్‌ అని అన్నారు. జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే, వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. TPCC అధ్యక్ష పదవిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

News March 17, 2026

గద్వాల్: రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల తనిఖీ

image

గద్వాల జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈవీఎంల నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్‌ను తెరిచి తనిఖీ నిర్వహించారు. యంత్రాల భద్రత విషయంలో ఎటువంటి అప్రమత్తత లోపించకుండా, నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

News March 17, 2026

ఎంపీ అవినాష్ వ్యాఖ్యలపై భూపేశ్ రెడ్డి కౌంటర్

image

వివేక్ కుమార్తె సునీతను అడ్డం పెట్టుకొని టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని మీ మాయ మాటలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. 11 సీట్లు వచ్చినా బుద్ధి మారలేదని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. వివేకాను హత్య చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.