News September 13, 2025
సంగారెడ్డి: జిల్లాకు ఆరెంజ్ అలర్ట్: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. జిల్లాకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని చెప్పారు.
Similar News
News March 13, 2026
బుక్ చేసిన 72 గంటల్లో సిలిండర్ డెలివరీ అవ్వాలి: అనకాపల్లి జేసీ

వినియోగదారులు తమ గ్యాస్‌ను బుక్ చేసుకున్న 72 గంటల్లో సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీ సౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరెట్‌లో డిస్ట్రిబ్యూటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద సేల్స్ ఆఫీసర్, తహశీల్దార్ ఫోన్ నంబర్‌లు ఉండాలన్నారు. అధికంగా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2026
పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన డీఈవో

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను డీఈఓ శుక్రవారం పరిశీలించారు. పాల్వంచలోని రెజీనా పాఠశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల సిట్టింగ్ సౌకర్యాలను తనిఖీ చేశారు. ఎండల దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
News March 13, 2026
రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో 14కి చేరిన మృతుల సంఖ్య

రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ మేరకు చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి(55) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య అధికారి డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 14కి చేరింది. అయితే వైద్యులు రెడ్డి అనంత లక్ష్మికి చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు.


