News September 13, 2025
వెంకటాపూర్: 34 అడుగులకు చేరువలో రామప్ప నీటిమట్టం

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రసిద్ధి చెందిన రామప్ప చెరువు నీటిమట్టం 33.6 అడుగులకు చేరింది. గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సరస్సులోకి వరద నీరు చేరుతుంది. సరస్వతి నీటిమట్టం 36 అడుగులు కాగా.. 35 అడుగులకు మత్తడి పడే అవకాశం ఉంది. దీంతో రెండు పంటలకు సరిపడా నీరు అందుతుందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 18, 2026
గోదావరి పుష్కరాలకు భద్రాద్రిలో 9 ఘాట్లకు రూ.376 కోట్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2027 గోదావరి పుష్కరాల కోసం 9ః ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.376 కోట్లు కేటాయించింది. భక్తుల సౌకర్యార్థం రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాలు సిద్ధం చేయనున్నారు. భద్రాచలం, మోతేగడ్డ, బూర్గంపాడు, మణుగూరు, పినపాక, అశ్వాపురం ప్రధాన తీర ప్రాంతాలు, మోతేగడ్డలో ప్రత్యేక VIP ఘాట్ ఏర్పాటు చేయనున్నారు.
News March 18, 2026
కోవూరు: ఇల్లా.. నందనవనమా..?

కోవూరు మండలం పాటూరులో ఓ వ్యక్తి తన ఇంటిని పూల చెట్లతో నందనవనంలా మార్చాడు. తన మూడు అంతస్తుల ఇంటిని ఒక్కొక్క అంతస్తుకి ఒక అరలాగా కనిపించేలా కాగితాల పూల చెట్లను అల్లించాడు. దీంతో వేసవి కాలంలో ఆ ఇంట్లో చల్లదనం తోపాటు స్వచ్ఛమైన గాలి అందుతోంది. ఈ రంగు రంగుల కాగితాల పూలతో ఆ ఇల్లు అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలను ఆకట్టుకుంటోంది.
News March 18, 2026
జహీరాబాద్ విద్యార్థి.. నవోదయలో అగ్రస్థానం

జవహర్ నవోదయ ఫలితాల్లో జహీరాబాద్‌కు చెందిన శరత్ చంద్ర మొదటి ర్యాంకు సాధించాడు. కంది మండలం ఓడీఎఫ్‌లోని కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న శరత్ చంద్ర 96.25 శాతం మార్కులు సాధించగా రూరల్ కేటగిరీలో మొదటి ర్యాంకు వచ్చింది. తనకు ఉమ్మడి జిల్లాలోని మొదటి ర్యాంకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. శరత్ చంద్రను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.


