News September 13, 2025
సిద్దిపేట: నిరుద్యోగులను మోసం చేసిన సీఎం: హరీశ్ రావు

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన హాజరై మాట్లాడారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గ్రూప్-1 పరీక్షల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
Similar News
News March 4, 2026
వరంగల్: పెండింగ్ గృహలక్ష్మి స్కీంకు మోక్షం!

గత ప్రభుత్వం ఇచ్చిన గృహలక్ష్మి స్కీం లబ్ధిదారులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న గృహాలను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చాలని నిర్ణయించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 49,853 ఇళ్లు కేటాయించగా, వాటిలో 26,617 ఇళ్లు గ్రౌండింగ్ చేశారు. బిల్లులు రాక చాలా ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో చేర్చాలని నిర్ణయం తీసుకొనడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.
News March 4, 2026
గద్వాల్: 99 రోజుల యాక్షన్ ప్లాన్

గద్వాల్ జిల్లాలో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రకటించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. “ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే మా ప్రధాన ఉద్దేశ్యమని తెలంగాణ ప్రగతిలో ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తాయి.
News March 4, 2026
NGKL: టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

బిజినేపల్లి మండలం మంగనూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన చింతకాయల లక్ష్మణ్ (26) అనే యువకుడు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వృత్తిరీత్యా దిండిలోని ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న లక్ష్మణ్, విధి నిర్వహణ ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.


