News September 13, 2025

సిద్దిపేట: చేనుకు చావు.. రైతుకు దుఃఖం

image

జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ముఖ్యంగా మొక్కజొన్నకు యూరియా చల్లే అదను దాటిపోవడంతో పంట ఎదగక పోవడం కళ్లముందే పంటనాశనం కావడం రైతులను కుంగదీస్తుంది. ఇప్పుడు యూరియా లభించి పోసినా లాభం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం అప్పాయిపల్లికి చెందిన రైతు బాలయ్య, హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌కు చెందిన రైతు శ్రీకాంత్ మొక్కజొన్న పంటలో పశువులను కట్టేసి మేపుతూ ఆవేదన చెందారు.

Similar News

News September 13, 2025

NZB: హైకోర్టు జడ్జీలతో భేటీ అయిన కలెక్టర్

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వారితో భేటీ అయ్యారు. జడ్జీలు నిర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శిచగా కలెక్టర్ వారితో భేటీ అయ్యి ఎస్సారెస్పీ ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

News September 13, 2025

అచ్యుతాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజమండ్రి వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కొయ్యలగూడెం వైపు వస్తున్న శ్రీరామ్ బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజమండ్రి వైపు వెళ్లే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీరామ్, అతని తల్లికి తీవ్రగాయాలు కాగా కొయ్యలగూడెం PHC నుంచి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్‌కి తరలించినట్లు EMT బద్రి తెలిపారు.

News September 13, 2025

గ్రేటర్ HYDలో సెప్టెంబర్‌లో పెరిగిన విద్యుత్ డిమాండ్

image

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిందని TGSPDCL అధికారులు గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సుమారు 3,600 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అధిక డిమాండ్ కారణంగా సరఫరా స్థిరంగా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.