News September 13, 2025

HYD: గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్.. విధుల్లో కొనసాగింపు

image

గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరిని ఈ విద్యాసంవత్సరానికి కూడా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంతోపాటు వివిధ జిల్లాల్లో దాదాపు 970 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు విధుల్లో ఉంటారు.

Similar News

News September 13, 2025

HYD: ట్రాఫిక్ అలర్ట్.. రేపు ఈ రోడ్లు బంద్..!(2/2)

image

HYDలోని మిర్ ఆలం మండి, ఏతెబార్ చౌక్, అలీజాహ్ కోట్లా, బీబీ బజార్, వోల్టా హోటల్, అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఎమ్.జే.మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నంపల్లి టీ జంక్షన్, హాజ్ హౌస్, ఏ.ఆర్.పెట్రోల్ పంప్, నాంపల్లి జంక్షన్ మార్గాల్లో రేపు ట్రాఫిక్ డైవర్షన్ అమలు కానుంది. వాహనాల రాకపోకలు నిలిపివేత కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు.

News September 13, 2025

HYD: ALERT.. రేపు ట్రాఫిక్ డైవర్షన్ (1/2)

image

SEP 14న ఉ.8 నుంచి రా.8 వరకు HYDలో ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుందని HYD పోలీసులు తెలిపారు. ఫలక్‌నుమా, ఇంజిన్ బౌలి, నాగుల్‌చింత క్రాస్ రోడ్, హిమ్మత్‌పురా జంక్షన్, వోల్గా, హరిబౌలి, పంచ్ మోహల్లా, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్‌గట్టి, మదీనా జంక్షన్, డెల్హీ గేట్, నాయాపూల్, ఎస్.జె.రోటరీ జంక్షన్, దారుల్‌షిఫా, పూరాణీ హవెలీలో రోడ్డు బంద్, డైవర్షన్ కొనసాగుతుంది.

News September 13, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా: అంజన్ కుమార్ యాదవ్

image

HYDలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ అభివృద్ధికి కృషి చేశానని గుర్తు చేశారు. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నానని, ఇప్పుడు గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.