News September 13, 2025
KNR: ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందారు కోల్’

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో వాడవాడలా బొడ్డెమ్మ పున్నం పండుగ ఘనంగా ప్రారంభమైంది. తీరొక్క పూలతో బొడ్డెమ్మను అలంకరించిన మహిళలు ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందారు కోల్’ అంటూ ఆనవాయితీగా పాడుతున్న పాటలను ఆలకిస్తూ చప్పట్లు కొడుతూ గౌరమ్మను కొలుచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. తెలంగాణ సాంప్రదాయాన్ని చాటే ఈ పండుగను జరుపుకోవండం ఎంతో సంతోషంగా ఉందని వనితలు అన్నారు.
Similar News
News April 2, 2026
VZM: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్‌బీఐ ఆర్‌సెటీ ద్వారా గ్రామీణ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ భాస్కరరావు తెలిపారు. ఈ నెల 6 నుంచి టైలరింగ్, ఎంబ్రాయిడరీ &ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కోర్సులు నిర్వహిస్తామన్నారు. 18-50 ఏళ్ల వయస్సు గల మహిళలు 9959521662 నంబర్‌కు ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. భోజనం,వసతి ఉచితమని, ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.
News April 2, 2026
కృష్ణా: బుక్ చేసిన 3- 8 రోజుల్లో సిలిండర్ల డెలివరీ: JC

LPG గ్యాస్ సిలెండర్ల ప్యానిక్ బుకింగ్స్ తగ్గడంతో జిల్లాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బుక్ చేసిన 3 నుంచి 8 రోజుల్లో డెలివరీలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే DCO ఆఫీస్ నంబర్ 08672-252493, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News April 2, 2026
పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: హరిత

జిల్లా వ్యాప్తంగా ఉన్న 335 గ్రాపంచాయతీల్లో ఏకకాలంలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, ఫ్రీ బస్సు, గ్యాస్ వంటి వాటి గురించి తెలపాలన్నారు.


