News September 13, 2025
వరంగల్: మత్తు పదార్థాలపై కఠిన చర్యలు

గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా నిల్వపై విశ్వసనీయ సమాచారం అందించాలని వరంగల్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, అమ్మకందారులు లేదా తరలింపులో ఉపయోగించే వాహనాలపై ఎవరైనా సమాచారం కలిగి ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు. దీనికోసం టోల్‌ఫ్రీ నంబర్ 1908 లేదా 87126 71111 ద్వారా అందించవచ్చు అన్నారు.
Similar News
News September 13, 2025
ప్రకాశం జిల్లా నూతన SP నేపథ్యం ఇదే.!

ప్రకాశం జిల్లాకు <<17699232>>SPగా వి హర్షవర్ధన్ రాజు<<>> నియమితులైన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన ఈయన అనంతపురం JNTUలో బీ.టెక్ పూర్తి చేశారు. 2013లో రాష్ట్ర పోలీసు సేవల్లో చేరారు. విజయవాడలో DCP, అన్నమయ్య, కడప జిల్లాల SP, విజయవాడలో CID SP, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తూ.. ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు.
News September 13, 2025
ఒంటరిగా ఉండకండి.. ఇది ప్రమాదకరం!

ప్రస్తుతం ఒంటరితనం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఉంటూ సమాజానికి దూరం కావడం, ఆర్థిక పరిస్థితులు, పట్టణీకరణ వంటి కారణాలతో ఒంటరితనం పెరిగినట్లు WHO పేర్కొంది. ఇది కేవలం మానసిక సమస్య కాదు, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8,71,000 మందికిపైగా చనిపోతున్నట్లు వెల్లడించింది. అంటే ఒంటరితనం వల్ల గంటకు 100 మంది చనిపోతున్నారన్నమాట.
News September 13, 2025
NRPT: ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి, ఎమ్మెల్యే

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచారని శనివారం హైద్రాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎకరాకు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భూ సేకరణ పనులు వేగంగా చేపడుతామని చెప్పారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఉన్నారు.