News September 13, 2025

గోదావరిఖని: ఈనెల 23న GOAకు స్పెషల్‌ బస్

image

ఈనెల 23న గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి గోవా స్పెషల్‌ ప్యాకేజీ కింద రాజధాని ఏసీ బస్‌ వెళ్తుందని డీపో మేనేజర్‌ శుక్రవారం తెలిపారు. మురేడేశ్వర్‌, గోకర్ణ, గోవాను చూసుకొని 28న బస్సు తిరిగి గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. ఒక్కరికి రూ.8,000లుగా టికెట్ ఛార్జీ నిర్ణయించామన్నారు. రిజర్వేషన్‌ కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Similar News

News March 8, 2026

వెంకీ-త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ న్యూస్!

image

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం-AK47’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ హాఫ్‌లో ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహా కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ మూవీని సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్తుందని సమాచారం. సెకండాఫ్‌లో ‘AK47’ ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

News March 8, 2026

MDK: పెరిగిన గ్యాస్ ధర.. రూ.36 కోట్ల భారం

image

కేంద్రం గ్యాస్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచడంతో శనివారం నుంచి కొత్త ధరలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 11.56 లక్షల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉండగా వినియోగదారులపై ఏడాదికి సుమారుగా రూ.36 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పప్పులు, నూనె, బియ్యం వంటి నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతుండగా తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది.

News March 8, 2026

సూర్యాపేట: షూటింగ్ బాల్‌లో శిరీష సత్తా

image

అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన గార్లపాటి శిరీష క్రీడారంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. షూటింగ్ బాల్ క్రీడలో 2024 ఆసియా పోటీల్లో కెప్టెన్‌గా వ్యవహరించి స్వర్ణ పతకం, 2026లో కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయిలో 5, రాష్ట్ర స్థాయిలో 8 పతకాలు గెలుచుకున్న ఈమె, గ్రామీణ ప్రాంత మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.