News September 13, 2025

విజయవాడ మీదుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్

image

విజయవాడ మీదుగా సెప్టెంబర్ 23న భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ నడపనున్నట్లు IRCTC తెలిపింది. 8 రోజుల పాటు సాగే ఈ టూర్‌ టికెట్ బుకింగ్స్‌కై IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చని సూచించింది. అరుణాచలం, రామేశ్వరం, మధురై, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు ఆలయాలను సందర్శించేలా ఈ టూరిస్ట్ ట్రైన్‌ను నడుపుతున్నామని, టికెట్ వెల రూ.14,100- 29,500 వేలు మధ్య ఉంటుందని పేర్కొంది.

Similar News

News March 14, 2026

WGL: వారం వ్యవధిలోనే ఇద్దరు మహిళలు మృతి

image

వరంగల్ నగరానికి చెందిన ఇద్దరు మహిళలు వారం వ్యవధిలోనే అమెరికాలో గుండెపోటు కారణంగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. నిట్ వరంగల్ రిటైర్డ్ ప్రొ.కె.లక్ష్మారెడ్డి-వెంకటలక్ష్మి కూతురు శ్వేత(40) ఈ నెల 10న గుండెపోటుతో మృతిచెందారు. కాగా వరంగల్ దేశాయిపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని చిదురాల విజయ రాణి (55) తన చిన్న కూతురు పూజ ప్రసవం కావడంతో మనవడిని చూసేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు.

News March 14, 2026

అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. డాలర్ కాకుండా యువాన్!

image

అమెరికా డాలర్‌ను దెబ్బకొట్టేందుకు ఇరాన్ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. US డాలర్ కాకుండా చైనీస్ యువాన్ కరెన్సీ చెల్లిస్తేనే ‘హార్ముజ్’ నుంచి నౌకలకు పర్మిషన్ ఇస్తామని ఇరాన్ ప్రతినిధి చెప్పినట్లు అల్-జజీరా తెలిపింది. కాగా ఎప్పటి నుంచో ఆయిల్ బిజినెస్ కేవలం అమెరికా డాలర్లలోనే జరుగుతోంది. దీనివల్ల డాలర్ సూపర్ పవర్‌ఫుల్‌గా మారి అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పుడు దానికి గండి పడే ఛాన్సుంది.

News March 14, 2026

హాస్టళ్లలో కట్టెల పొయ్యిలపై వంట.. ఐటీ కారిడార్‌లో పొగ

image

TG: హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ల కొరతతో చాలా వరకు హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్‌లో బిల్డింగుల మధ్య నుంచి పొగ వ్యాపిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటికే చాలా పీజీలు, హాస్టళ్లలో టిఫిన్లు ఆపేశారు. తక్కువ గ్యాస్ వినియోగంతో పూర్తయ్యే వంటలే చేస్తున్నారు.