News September 13, 2025
కుక్కలను చంపి పాపం మూటగట్టుకోవద్దు: మంత్రి

TG: వీధి కుక్కల సమస్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘US లాంటి దేశాల్లో మనుషుల్లాగే కుక్కలకూ విలువ ఇస్తున్నారు. వాటిని చంపాల్సిన అవసరం లేదు. పాపం మూటగట్టుకోవద్దు. దత్తత తీసుకునే కార్యక్రమాలకు సహకారం అందిస్తాం. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్‌పై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి. కుక్క కాటుకు గురికాకుండా, ఒకవేళ గురైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి’ అని సూచించారు.
Similar News
News March 11, 2026
నల్గొండ: అప్పు విషయంలో గొడవ ప్రాణం తీసింది

అప్పు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆంజనేయులు, శంభు లింగం మధ్య అప్పు విషయంలో ఘర్షణ తలెత్తింది. శంభు లింగంకు తీవ్రగాయాలు కావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంభు లింగం మరణించాడు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News March 11, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరింది. నిన్నటి నుంచి రూ.1,630 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.850 ఎగబాకి రూ.1,49,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.3,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 11, 2026
జాగ్రత్త.. లేపేస్తాం: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే ఇరాన్‌ను మరింత బలంగా దెబ్బతీస్తామని ట్రంప్ హెచ్చరించగా.. దీనిపై ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ ఘాటుగా స్పందించారు. ‘మీకంటే గొప్పవారే ఇరాన్‌ను ఏమీ చేయలేకపోయారు. జాగ్రత్త.. లేదంటే మీరే లేకుండాపోతారు’ అని ట్రంప్‌ను హెచ్చరించారు.


