News September 13, 2025

అభివృద్ధి ఓ వైపు.. ఉద్యమం మరో వైపు..!

image

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.150 కోట్లను కేటాయించగా వందరోజుల యాక్షన్ ప్లాన్‌తో పనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పంటనష్ట పరిహారం వివాదం తెరపైకి వచ్చింది. జాతర సమయంలో పంట నష్ట పోతున్న రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైతాంగ పోరాటాన్ని BRS వెనకుండి నడిపిస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 25, 2026

చమురు వణుకుపుట్టిస్తోంది!

image

ప్రపంచంలో ఆయిల్ కొరత అతిపెద్ద సమస్యగా మారింది. గల్ఫ్‌తో పాటు ఇతర వనరులూ దాడులకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభానికి ప్రత్యామ్నాయం అనుకున్న రష్యన్ రిఫైనరీలూ ఇప్పుడు టార్గెట్‌గా మారాయి. ఇటీవల రష్యా రిఫైనరీలోని కోటి లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. మరోవైపు USలోని టెక్సాస్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఫలితంగా గ్లోబల్ సప్లై చెయిన్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

మునగాల సాగర్ ఎడమ కాలవలో మృతదేహం

image

మునగాల మండల పరిధిలోని సాగర్ ఎడమ కాలవలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం కాలవ వద్దకు వెళ్లిన రైతులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించి వెంటనే గ్రామస్థులకు, సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.