News September 13, 2025

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం 4 గంటలలోపు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, నల్గొండ, సిద్దిపేటలో వాన పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొంది.

Similar News

News March 21, 2026

IPLలో గ్రేటెస్ట్ టీమ్ ఇదే: పఠాన్

image

IPLలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ టీమ్ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ముంబై, చెన్నైలలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే కష్టమే. చెన్నై 2010లో, ముంబై 2013లో తొలిసారి టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. కానీ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్లను అందించడంలో ముంబై ముందు వరుసలో ఉంది. అందులో నలుగురు టీమ్ ఇండియా కెప్టెన్లు ఉన్నారు. అందుకే ముంబై అంటే నాకు గౌరవం’ అని తెలిపారు.

News March 21, 2026

గ్రీన్ 2 ఓవర్లే వేస్తే రూ.2 కోట్లు కట్ చేయాలి: అశ్విన్

image

KKR ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన 2 ఓవర్లే బౌలింగ్ వేస్తే ఫీజు నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలి. 4 ఓవర్ల కోటా పూర్తి చేయకపోతే డబ్బును తగ్గించే హక్కు IPL ఫ్రాంచైజీలకు ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. IPLలో గ్రీన్‌ 4 ఓవర్లు వేయడానికి AUS అనుమతిస్తుందా? అనేది వేచి చూడాలన్నారు. కాగా గాయాలు కాకుండా ఉండేందుకు గ్రీన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా పరిమితులు విధించింది.

News March 21, 2026

ఏకంగా 20 కోతుల దాడి.. అక్కడికక్కడే మృతి

image

తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంకు చెందిన చిన్న బుల్లెమ్మ(65) గేదెకు నీరు పెడుతుండగా కోతులు గుంపులుగా వచ్చి ఆమెపై దాడి చేశాయి. ఏకంగా 20 కోతులు ఒకేసారి మీద పడటంతో తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరి మీ దగ్గరా కోతుల బెడద ఉందా? కామెంట్ చేయండి.