News September 13, 2025
విజయవాడ: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా విశాఖ(VSKP)-తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08583 VSKP-TPTY రైలు ఈ నెల 15 నుంచి NOV 24 వరకు ప్రతి సోమవారం, నం.08584 TPTY-VSKP రైలు ఈ నెల 16 నుంచి NOV 25 వరకు ప్రతి మంగళవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడతో పాటు కైకలూరు, గుడివాడలో ఆగుతాయని చెప్పారు.
Similar News
News September 13, 2025
నిజాంసాగర్: 2 గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కులు విడుదల

ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి శనివారం సాయంత్రం 2 గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోకి 11,887 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.383 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు. కాగా ప్రాజెక్టు ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
News September 13, 2025
రేపే INDvsPAK.. మ్యాచ్ చూస్తారా?

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటే క్రేజే వేరు. కొందరైతే ఎంత ఖర్చయినా సరే విదేశాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తుంటారు. కానీ పహల్గామ్ అటాక్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాయాదుల పోరుపై చాలామంది ఇంట్రెస్టే చూపట్లేదు. కొందరేమో మ్యాచ్‌ను మ్యాచ్‌లా చూడాలంటున్నారు. SMలో ఇంత రచ్చ అవుతున్నా BCCI & ప్లేయర్లు స్పందించలేదు. ఇంతకీ రేపు జరిగే మ్యాచ్‌ను మీరు వీక్షిస్తారా? బహిష్కరిస్తారా? కామెంట్ చేయండి.
News September 13, 2025
నరసరావుపేట: తొలి సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కృతిక శుక్లా శనివారం కలెక్టరేట్లో జేసీ సూరజ్, జిల్లా అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు గురించి చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించాల్సిన పలు అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.