News September 13, 2025

SMకు దూరంగా ఉంటా.. మరో హీరోయిన్ ప్రకటన

image

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘సోషల్ మీడియా నా పనిపై, ఆలోచనలపై దృష్టి పెట్టకుండా చేస్తోంది. నా సృజనాత్మకతను దెబ్బతీసింది. నాలోని కళాకారిణిని, నన్ను రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా. అయినా నిజమైన సంబంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి పెడతా’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. <<17686001>>అనుష్క<<>> కూడా SMకు దూరంగా ఉంటానని ఇటీవల ప్రకటించింది.

Similar News

News March 16, 2026

ఆస్కార్-2026 చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

image

* వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్- జియో హాట్‌స్టార్
* సిన్నర్స్- జియో హాట్‌స్టార్
* ఫ్రాంకెన్‌స్టైన్- నెట్‌ఫ్లిక్స్
* కెపాప్ డీమన్ హంటర్స్- నెట్‌ఫ్లిక్స్
* వెపన్స్- జియో హాట్‌స్టార్
* F1- ప్రైమ్ వీడియో(రెంట్), ఆపిల్ టీవీ

News March 16, 2026

‘స్వప్నం’ నెరవేర్చుకుంది.. 2 నెలల్లో 5 బ్యాంకు ఉద్యోగాలు

image

AP: బ్యాంకు ఉద్యోగం సాధించాలనే తన లక్ష్యానికి పెళ్లి అడ్డుకాదని నిరూపించారు విశాఖకు చెందిన స్వప్న. డిగ్రీ వరకు చదివిన ఈమె వివాహం తర్వాత శ్రీకాకుళం(D) జొన్నలపాడులో అత్తగారింట్లో పట్టుదలతో చదివారు. 2 నెలల వ్యవధిలోనే ఏకంగా 5 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. JAN 15న IBPS PO, FEB 23న RBO PO, FEB 27న SBI జూనియర్ అసోసియేట్, మార్చి 2న BOBలో క్లర్క్, మార్చి 15న APGBలో క్లర్కు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

News March 16, 2026

ఆయన త్యాగఫలమే ప్రత్యేక రాష్ట్రం

image

ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి నేడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఈ త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పడింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ఎంతో అభిమానం. అందుకే ‘శ్రీరాములు లాంటి వారు మరో పదిమంది ఉంటే ఏడాదిలోనే స్వరాజ్యం తెస్తాను’ అని గాంధీజీ చెప్పేవారు.