News September 13, 2025

హుజూర్‌నగర్: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

image

హుజూర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భర్త మరణించిన మూడు రోజులకే భార్య మృతి చెందారు. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి అప్పారావు గుండెపోటుతో సెప్టెంబర్ 10న మృతి చెందారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య గెల్లి అరుణ శనివారం మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Similar News

News September 13, 2025

నంద్యాల కొత్త SP ఈయనే.!

image

నంద్యాల ఎస్పీగా సునీల్ షెరాన్ రానున్నారు. ప్రస్తుత ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సునీల్ బాధ్యతలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 14 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

News September 13, 2025

గద్వాల్‌లో ఉప ఎన్నికలు ఖాయం- కేటీఆర్

image

గద్వాల్ గర్జనలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల తన అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లారని విమర్శించారు. పార్టీ మారిన MLAపై అనర్హత వేటు పడి ఉపఎన్నిక వస్తుందన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో గద్వాల్ నియోజకవర్గంలో 50,000 మేజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News September 13, 2025

GWL: విద్యార్థి దశలోనే మావోయిస్టు సిద్ధాంతాల వైపు

image

హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగి పోయిన మావోయిస్టు మహిళ నేత కల్పన @ సుజాత విద్యార్థి దశ నుంచే మావోయిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. 10వ తరగతి వరకు అయిజలో చదివారు. ఇంటర్, డిగ్రీ గద్వాల MALD కాలేజీ పూర్తి చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా రాడికల్స్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితులై చివరకు అడవి బాట పట్టారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలుగా కొనసాగుతూ జనజీవన స్రవంతిలో కలిశారు.