News September 13, 2025

నల్లగొండలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

నల్లగొండలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుంగతుర్తిలోని ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఏలేటి సోమిరెడ్డి (45) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో కార్యాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News March 11, 2026

శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

image

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్‌కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.

News March 11, 2026

కలెక్టర్ల సదస్సుకు వెళ్లిన విజయ కృష్ణన్

image

అమరావతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సుకు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులు పాటు నిర్వహించనున్న సదస్సులో కలెక్టర్‌ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు. జిల్లాకు వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న మౌలిక వసతులపై నివేదిక సమర్పిస్తారు.

News March 11, 2026

దువ్వాడ-విశాఖ-విజయనగరం రైల్వే లైన్ అప్‌గ్రేడ్‌కు గ్రీన్ సిగ్నల్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని 106 కి.మీ.ల దువ్వాడ-విశాఖ-VZM సెక్షన్‌లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ అప్‌గ్రేడ్‌కు రైల్వే శాఖ రూ.318.07 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 1×25 KV వ్యవస్థను ఆధునిక 2×25 KVగా మార్చనున్నారు. దీంతో విద్యుత్ సరఫరా పెరిగి రైళ్ల వేగం, సరకు రవాణా సామర్థ్యం మెరుగుపడనుంది. హౌరా-చెన్నై మార్గంలో ఉన్న ఈ సెక్షన్ ద్వారా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఖనిజాలు విశాఖ పోర్టుకు తరలిస్తారు.