News September 13, 2025
VKB: రాజీమార్గంతో మేలు: జడ్జి

రాజీమార్గమే రాజ మార్గమని, రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకుంటే కక్షలు తగ్గిపోయి సమయం వృథా కాకుండా ఆర్థికంగా చితికి పోకుండా మేలు జరుగుతుందని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించారు. జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకొని కక్షిదారులు న్యాయం పొందాలని తెలిపారు.
Similar News
News September 13, 2025
సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి: CM

AP: రాజకీయ ముసుగులో జరిగే నేరాలను ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్పీలతో సమావేశమైన ఆయన.. టెక్నాలజీ సాయంతో దర్యాప్తులో అత్యుత్తమ ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలన్నారు. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలని ఆదేశించారు. వైఎస్ వివేకానంద హత్య, సింగయ్య మృతిని కేసు స్టడీలుగా చూడాలని సూచించారు.
News September 13, 2025
NGKL: లోక్ అదాలత్‌లో 23,967 కేసుల పరిష్కారం

నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సివిల్, బ్యాంకు, విద్యుత్, అధికారులు పెట్టిన కేసులు రాజీ మార్గంలో పరిష్కరించారు. మొత్తం 23,967 కేసులు పరిష్కారం అయ్యాయి. రూ.61,89,914 వసూలయ్యాయి. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు వెంకట్రావు, శ్రుతి దూత, శ్రీనిధి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
News September 13, 2025
15న యథాతథిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15న సోమవారం యథాతథిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా meekosam.ap.gov.in తెలియజేయాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రం పీజీఆర్ఎస్‌లో అందజేయాలన్నారు.